ఓం గం గణపతయే నమః! శ్రీ మహా గణపతి "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

 👌శ్రీ మహా గణపతిని
     శంకర ప్రియ సుతుని
     సేవింపుము భక్తిని
               ఓ తెలుగు బాల!
     (తెలుగు బాల పదాలు.,)
🔯 శ్రీ మహా గణపతి స్వామి వారు.. జ్ఞాన, విజ్ఞాన దాయకుడు! సకల మానవాళికి... సుఖ సంతోషములను అనుగ్రహించు; శంకర భగవానునకు ప్రియమైన పుత్రుడు!
🔯 పరిశుభ్ర మైన తెల్లని వస్త్రము దాల్చిన వాడు ( శుక్లాంబర ధరుడు)! అంతటా వ్యాపించి యున్న వాడు ( విష్ణు మూర్తి )! చంద్రుని వంటి వన్నెతో, నాలుగు చేతులతో,  ప్రశాంత మైన ముఖముతో విరాజిల్లు చున్నాడు... శ్రీ మహా గణపతి స్వామివారు!
🙏ప్రార్ధనా పద్యము
        శ్రీ మహా గణపతి నుపాసింతు భక్తి,
        సర్వ విఘ్నోప శాంతి నొసంగి బ్రోవ!
        శుక్ల వస్త్రా న్వితున్, విష్ణు, సు ప్రసన్న 
        వదను, శశి వర్ణు, భుజయుగ ద్వయు, గజాస్యు,
         శ్రీ మహా గణపతి నుపాసింతు భక్తి,
        సర్వ విఘ్నోప శాంతి నొసంగి బ్రోవ!!
( తెలుగు సేత: "ఆర్ష కవి శిరోమణి" విద్వాన్ బులుసు వేంక టేశ్వర్లు., శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.,  మంగళా చరణము కావించిన, పద్య రత్నం )
        ఓం గం గణపతయే నమః!
కామెంట్‌లు