👌శాంత రూపిణీ వీవే!
ఘోర రూపిణీ వీవె!
శివ దూతి! శాంతి మతి!
నారాయణి! శివాని!
( "నారాయణి" పదాలు., )
🔯 పరం బ్రహ్మ రూపిణి, నారాయణి ... శివుని దూతగా పంపిన, కౌశికీ దేవి రూపమున నున్నది. దేవతలకు.. పరమ శాంతమైన రూపమున నున్నది శివ దూతి జనని!
🔯 శ్రీ మహారాజ్ని... శివ దూతీ, మాతృ శక్తి రూపమును దాల్చి నది. దానవులకు.. అతి భయంకర మైన రూపమున నున్నది; మాతృ రూపిణీ లలో ఒకటి... శివ దూతీ!
🔯 ఆది పరాశక్తి యగు, పరమేశ్వరి కి... రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తు లతో నమస్కరించు చున్నాను! అని, మన మంతా.. శ్రీమాతను ధ్యానించాలి!
🙏ధ్యాన శ్లోక రత్నము:
శివ దూతీ స్వరూపేణ!
హత దైత్య! మహా బలే!
ఘోర రూపే! మహా రావే!
నారాయణి! నమోస్తు తే!
( "నారాయణి స్తోత్రం".. శ్రీ దుర్గా సప్తశతి" ఏకాదశ అధ్యాయం లోనిది. నిత్యము పారాయణము చేయండి. )
నారాయణి! నమోస్తు తే! "శివ దూతి రూపిణీ" "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి