1
అక్షరశిల్పికాళన్న!
ధన్యజీవియెచూడన్న!
దగాకోరులందరినిల
తరిమితరిమికొట్టెరన్న!
2.
బహుభాషలకోవిదుండు!
యాసభాషచాటినోడు!
ప్రజలగొడవతనగొడవని
జనులవైపునిలచినోడు!
3.
రజాకార్లదోపిడిలను !
అరికట్టినెదురనిలచెను!
పీడితవర్గాలందరికి
అభయమిచ్చినాదుకొనెను!
4.
అన్నపురాశులొకచొట!
ఆకలిమంటలునొకచోట!
తారతమ్యబేధములను
సరిగనడిపెనునొకబాట!
5.
హంసతూలికలొకచోట!
అలసినదేహాలొకచోట!
ధనికపేదభావములను
నడిపినాడుప్రగతిబాట!
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి