1.
సంగీతమునందురేడు
గానలహరిమాంత్రికుండు
బాలసుబ్రమణ్యుడిల
రవిరాజుగవెలిగినాడు.
2.
మనసుదోచుపాటలెన్నొ
ఫరిమళమగుమాటలెన్నొ
నవరసములనెన్నొబాలు
కనులవిందుచేసెయెన్నొ
3
నటనయందుమేటియతడు
మెరుపులాగ వెలిగినాడు
హావ భావములను చూపి
నటరాజుగ నిలచినాడు
4
పురస్కారములను పొంది
ముదమారగహర్షమొంది
రాజపత్రములను యెన్నొ
రాజసముగ బాలు పొంది
5
చిత్ర సీమయందు నతడు
రారాజుగ వెలిగినాడు
మధురమైనపాటలెన్నొ
వినసొంపుగపాడినాడు
6
తీయనైన పాటలను
చల్లగ ఆలపించెను
కొత్తగాయకులనెన్నొ
సరిగమల నేర్పించెను
7.
బాల్యమందుచదువులోన
మెళుకువలెన్నొజ్ఞానమున
మేళవించుకున్నబాలు
విరబూసెను విశ్వమునను
8
గానమందుగంధర్వుడు
స్వర్గసీమకేగినాడు
దేవలోకదేవుళ్లకు
గానకచెరిచేసినాడు
9
నలబైవేలగీతాలు
భక్తిరసములాపాటలు
వినిపించెనుతనగళమున
జానపదులజావళీలు
10.
కోయిలమ్మపాటలాను
చిలకపలుకులమాటలను
మురిపించెనుమీగొంతున
సెలయేరులఝరులుగాను
*గానగంధర్వుడు* *(మణిపూసలు)*:-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి