*తెలుగు మణిపూసలు*:- *మిట్టపల్లి పరశురాములు**సిద్దిపేట* *చరవాణి:9949144820*
 1
పాలకోవ తీపికన్న
చెరకుగడలరసముకన్న
 తెలుగు భాష మధురమన్న
కమ్మనైనజున్నుకన్న
2
 తీయనైన పండ్లకన్న
 కదిలి పాక రసముకన్న
రుచులధారనురుగువోలె
తెలుగుభాషమెండుగన్న
3
 పసిడిపాపనవ్వుతీరు
ముత్యములవిమెరియు

తీరు తళుకుబెళుకువెలిగేటి
తెలుగుభాషఝరులుపారు
4
తెల్లనైనమంచువోలె
వెన్నెలమ్మ వెలుగువోలె
తెలుగుభాషవెలిగిపోయె
పున్నమిజాభిల్లివోలె 
             ****

కామెంట్‌లు