"రుగాగమసంధి" పదాలతో:---మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

సీసపద్యం

ఇంటి యిల్లాలుగా యిగురము గలిగియు
అత్తమామల సేవ నామె జేయు,
బీదరాలునయిన పేర్మితోజూచును
బంధుజనుల జేరి పలుకరించు,
గుణవంతురాలుగా గొప్ప మనసుగల
జవరాలు వంశాన్ని చక్కదిద్దు,
బాలింతరాలుగా పసిపాపలను సాకు
పెంచి పెద్దగ జేయు పేరు నిలుప.

తేటగీతి

వనిత లేని యిల్లును జూడ వనము తీరు,
బుద్ధిమంతురాలుగతాను పుడమి నందు,
తీర్చి దిద్దిను కాపురం తేరు విధము,
కోరలేదు తాను ఫలము కోర్కె మీర,
కనికరమును జూపించ కరిగిపోవు,
ముద్దరాలు మనస్సులో మోదమొందు.

కామెంట్‌లు
కాపు రమేశ్ చెప్పారు…
బాగూంది మేడం, గొట్టు పదాలేమీ లేకుండా 👌👌🙏🙏🙏