ఎండా వానల అద్భుతం :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

చిరు చిరు మబ్బులు వచ్చాయి 
చిటపట చినుకులు తెచ్చాయి
కావు కావు మని కాకులు
గుంపులు గుంపులు వాలాయి

ఎండా వాన కలిసొస్తాయి
కాకుల పెళ్లి అన్నాయి
పిల్లల సంబరపడ్డారు 
చిందులు వేస్తూ ఎగిరారు

ఎండకు  ఎండే పక్షులు
వాన తడిసే పక్షులు
ఎండవానల కలయికతో 
కొత్త ఆటలే ఆడాయి
కామెంట్‌లు