వెంటాడుతూ తరుముతున్నప్పుడు
వలువలూడిన మానవత్వం
శిలగా నిలుచున్నప్పుడు
ధగాచేసిన చీకటి
దర్జాగా తిరుగుతున్నప్పుడు
లేళ్ళు , కుందేళ్ళను సైతం
రారాజే నంజుకు తింటున్నప్పుడు
పసితనాన్ని చిదిమేసే పరమనీఛులు
పహారా కాస్తున్నప్పుడు
జ్ఞాపకాల పుటలను
చెదపురుగులన్ని చేరి నమిలేస్తున్నప్పుడు
నమ్మించే నాటకాలు
వీధి గుమ్మం ముందర పోటీపడుతున్నప్పుడు
రెక్కలు విప్పుకున్న రాబంధులు
శ్రమ జీవులకు గాయాలు చేస్తున్నప్పుడు
అల్లుకున్న అజ్ఞానాంధకారాన్ని
చీల్చి చెండాడే విలుకాడి బాణమై
ఉవ్వెత్తున ఎగిసిపడే అలల తరంగమై
లక్ష మెదల్లను కదిలించే అక్షరం
చైతన్యమై రావాలి..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి