అవసరానికి గాయమైంది,
గుండె గదుల్లోంచి పెల్లుబికిన
కన్నీరు వరదలై కడలి కౌగిలచేరి
కదలుతుంటాయి,!
బలవంతుని రాజ్యంలో ...
బక్కవాడెప్పుడు బలి పశువే!
ఆకాశాన ఎగిరే గధ్ధ చూపెప్పడు
భూమిపైనున్న చిన్న పురుగులపైనే!
మేధను తొక్కేపట్టి,
కళ్ల కు గంతలు కట్టి,
తన చూపుతో బ్రతుకు బండిని
గమ్యం లేని అగమ్యంలోకి
నెట్టుతుంటాయి,!
కాళ్ళకు లంకెలను కట్టి,
కళ్లకు తమాలోచన లోచనాలను తొడిగి
బ్రతుకు బండి లాగిస్తాయి ...!
ఆలోచనొక్కరిది,
ఆచరణ వేరోకరిది,
గుండె చప్పుడు వొకరిది,
అనుభూతుల దొంతరులు వేరోకరివి,
అరచేతిలో స్వర్గం అమ్మకానికో మాట
అంధకారంలోకి బాట
బ్రతుకు పోరాటంలో
తిలోదకాలిచ్చిన మానవత!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి