-పాఠశాలల పునఃప్రారంభం-సాహితీసింధు సరళగున్నాల

 కం*నెలలుగ మూసిన బడులివి
కళదప్పెనుబూజుబట్టి క్రమ్మెనునిశియే
వెలుగులునింపెడు దివిటిగ
తెలవారగవార్తయొకటి తేజమునింపెన్

కం*మోదమునొకవైపుండగ
వేదనమరియొక్కవైపు వెంటాడిననీ
బాధలుదప్పుటనెన్నడు
మోదంబునవిద్యలెటుల మొదలెట్టెదనో

కం*మూతికిమాస్కులబెట్టియు
చేతనమందించువిద్యజెప్పుటనెటులో
రాతలమార్చగ గన మా
రాతలుకోవీడుపాలు రక్షణకరువే

కామెంట్‌లు