అది ..అంతే ...!!: -----కె.ఎల్వీ. హన్మకొండ

 వర్షాకాలం వస్తే ...
వర్షాలువస్తాయి 
ఇదిసృష్టి ధర్మం,
అందరికీ తెలిసిందే !
మాకుమాత్రం ...
కాలనీలు --
మునిగినప్పుడు ,
వరదలు 
ముంచెత్తినపుడూ 
వర్షాకాలం గుర్తొస్తుంది !
కెమెరాలముందు 
ప్రతికండు వా.....
రంగు ప్రాతిపదికగా
వాగ్ధానాలవర్షం
కురిపిస్తున్ది.......!
వాగ్ధానాలన్నీ 
మట్టిలోకలిసిపోయి 
అవసరాన్నిబట్టి 
మరుసంవత్సరం 
ఏపుగా మొలకెత్తుతాయి ,!
మనిషికందని ...
ఆ ..వాగ్దానాల చక్రం 
విశ్రాంతి లేకుండా ...
నిత్యం 
తిరుగుతూనేవుంటుంది !!
         
కామెంట్‌లు