అనుకొన్నది సాధించడంలో విఫలమైనా ఆ అనుభవం నీ భవిష్యత్తును మలుచుకోవడానికి నిచ్చెనగా ఉపయోగపడుతుంది.
ఉత్తముల్ని వివేకం, మధ్యముల్ని అనుభవం, అధముల్ని అవసరం, జంతువుల్ని స్వభావం నడిపిస్తాయి. సిసిరో
చదవడం కంటే మాట్లాడడం అధిక లాభకర అనుభవం. స్టువర్ట్ చీజ్
చిన్న అక్షరాలను శ్రద్ధగా చదవటమే చదువు. దానిని చదవకుండా పొందేది అనుభవం.
నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం అనవద్దు. అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది. వాస్తవం తెలిస్తేనే పరిస్థితులు అవగాహనకు వస్తాయి. పరిస్థితులు అవగాహన కొస్తేనే సరియైన నిర్ణయాలకు రాగలం.
నేటి అనుభవం నిన్నటి ఫలితం, రేపటి అనుభవం ఇవాళ చేసే పని.
మనిషికేమి జరిగిందని కాదు, ఏదైనా జరిగినప్పుడు మనిషి స్పందనే అనుభవం. ఆల్డస్ హక్స్ లీ
లక్షమంది కొత్తవారి కంటే అనుభవంగల ఒక్క మనిషి మేలు.
సకలశాస్త్రాలకు మూలం అనుభవం. ఆ అనుభవం నుంచే నానుడులు, సూక్తులు ఉదయించాయి. సెర్వాంటీస్
సముద్రంలో చారెడు నీళ్ళు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఒక చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు.
అనుభవం: - పెద్ది సాంబశివ రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి