*దాలినాయుడు మాస్టారు ఉత్తమ ఎక్స్ -రే కవితా పురస్కారం*

 సాలూరు పట్టణానికి చెందిన కవి రచయిత సమీక్షకుడు కిలపర్తి దాలినాయుడు (దానా) ప్రముఖ సాహితీ సంస్థ ఎక్స్-రే వారు నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలలో కవిత అవార్డును అందుకోనున్నారు. దాలినాయుడు గారు ఈ పురస్కారాన్ని 20 20 సంవత్సరానికి అందుకోనున్నారని ఎక్స్-రే అధినేత శ్రీ కొల్లూరి గారు తెలిపారు.వరుసగా ఈ జాతీయస్థాయి పోటీలలో ఇది 40వ.పోటీగా తెలిపారు.శ్రీదాలినాయుడుగారు "మా సంస్థ పోటీలో తొలిసారి2017లో అందుకున్నారు
ఇది రెండొవ సారి అని" శ్రీకొల్లూరి పేర్కొన్నారు.సాలూరు సాహితీ మిత్రబృం వ్యవస్థాపక అధ్యక్షులు
శ్రీ జె.బి.తిరుమలాచార్యులు"ఇది మాసంస్థకు గర్వకారణమని తెలిపారు.ప్రస్తుత కార్యవర్గ బాధ్యులు శ్రీమతి రావాడ క్రిష్ణకుమారి,గొట్టాపు శ్రీనివాసరావు,ఆకుల గణపతి మాస్టారు,శేషు,చందు,గౌరీశంకర్రావులు అభినందనలు తెలిపారు.
కాగా శ్రీ దాలినాయుడు మాస్టారు
రామభద్ర పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పాఠశాల సహాయకులు గా పని చేస్తున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కర్రీ కామేశ్వరరావు గారు ఇంచార్జి శ్రీ ఎన్ నాగభూషణ రావు గారు పాఠశాల కార్యదర్శి శ్రీ మురళీధర్ రావు గారు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు