చీరకట్టులో
స్త్రీఅంద-చందాలు
భారతీయ సంస్కృతి కి
నిలువుటద్దాలు ...!!
--------------------------------
సంప్రదాయం లో
మచ్చుకి మాదిరి గా
మారింది చీర ధారణ !
పరిమితంగా ....!!
--------------------------------
బీదా బిక్కీ ధనికులు
తేడాలేకుండా ...
అన్నిస్థాయిల వారికి
చీర లభ్యం....!!
----------------------------------
ఫ్యాషన్ పేరు....
వింత పోకడలజోరు !
చీర కనుమరుగై
డ్రస్సుల హోరు ...!!
-----------------------------------
ఆధునికత్వపు
సంప్రదాయపు వలసల్లో
చీరలు అటు .....
డ్రెస్సులు ఇటు !!
------------------------------------
పనిపాటల్లో వనిత
సౌఖర్యంకోసమే...
చుడీదార్ ...!
చీరది చుట్టం చూపే!!
--------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి