చిన్న పిల్లలలో అనారోగ్య సమస్యలు - జలుబు, దగ్గు.: - పి . కమలాకర్ రావు

 వర్షాలు, ముసుర్లు, చలిగాలుల వల్ల చాలా మంది పిల్లల్లో, దగ్గు, జలుబు, వచ్చి ముక్కుదిబ్బడ తో గాలి ఆడక ఇబ్బందులు పడుతుంటారు. ఈ వాతావరణాన్ని తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.రెండు తమలపాకులను కడిగి ముక్కలుగా త్రుంచి నీళ్లల్లో వేసి కొన్ని కిష్మిష్ లను, నలగ్గొట్టిన, యాలకులను, లవంగాలను వేసి బాగా మరిగించి చల్లార్చి చిన్న పిల్లలకు త్రాగించాలి. ఇది దగ్గు జలుబులను తగ్గిస్తుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఒకవేళ ఛాతి లో కఫము ఎక్కవగా ఉంటే కొబ్బరినూనెలో కర్పూరం పొడి కలిపి తమలపాకు పై రాసి వెచ్చగా చేసి ఛాతి పై కట్టాలి. కఫము తగ్గిపోతుంది. జలుబు తగ్గేవరకు వేడిచేసి చల్లార్చిన నీటినే త్రాగాలి.
కామెంట్‌లు