రాకాసిరాజ్యంలో రాలిపోతున్న అబలలు : - భరద్వాజ రావినూతల

 251)
ఎటుపోతోంది  మనదేశం అభివృద్ధి 
మహిళారక్షణలో మారదా బుద్ది 
మహిళాసంక్షేమలో లేదు శుద్ధి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
252)
కన్యాశుల్కమన్నారు కాల రాశారు 
సతీసహగమని    చితులెక్కించారు 
వరకట్నాల  పొయ్యిలో పడేసారు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
253)
కట్టుకున్నందుకు  కానలలో  తిప్పాడు 
తాళికట్టినందుకు వేలంలోపెట్టాడు 
అనుమానాలతో రాయినిచేసాడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
254)
యత్రనార్యస్తు అంటూ శ్లోకాలు 
 కలకంఠి కన్నీరంటూ సూక్తులు 
చేతల్లోమిగలని శాస్త్రాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
255)
మారలేదు మగజాతినైజం 
వారిఆకృత్యాలకు ఎప్పుడోఅంతం 
ఉద్యమించాలి మహిళా శక్తీ 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!

కామెంట్‌లు