చిత్రానికి పద్యం-సాహితీసింధు సరళగున్నాల
తే.గీ*అందమన్ననునీదేను హాయినింప
కట్టుబొట్టులో హైందవముట్టిపడగ
నగలుపెట్టినమెడలోన నాగమల్లి
దండలేసియు మురిచెదనండవనుచు

కం*చిరునగవు మోమునేగన
అరవిరిసిన పుష్పమట్లు నలరింపంగన్
మరినీకిచ్చెదదీవెన
సరిపోవగవందయేళ్ళు జతనముగుండన్

ఆ.వె*నీలిరంగుచీర నెమలంచురైకతో
అందమద్దినావు మందగమన
నిన్నుజూడకనులు నిమిలించవోపకన్
చూపుదిప్పవయ్యె సుందరాంగి 


కామెంట్‌లు