గురువు ముత్యాలహారాలు:-రాథోడ్ శ్రావణ్--ముత్యాలహారం రూపకర్తఉసావే ఉట్నూరు

గురువుగా రాష్ట్రపతి
బెనారస్ కు కులపతి
చేసె ఉపాధ్యాయ వృత్తి
మార్చేను దేశస్థితి

గురువు రాధాకృష్ణులు
వేదాంతల రచనలు
సత్యఆత్మ శోధనలు
తత్వశాస్త్ర బోధనలు

విద్యా బోధన గురువు
వ్యక్తిత్వ కల్ప తరువు
జ్ఞాన సాగర సింధువు
భారతానికి బిందువు

గొప్ప రాష్ట్రపతిగా
ఒక  సాహితీవేత్తగా
పుట్టిన రోజు గుర్తుగా
గురువు దినోత్సవంగా

కలంతో పోరాడిన
వేదాంతాల రచన
నాగరికత నేర్పిన
గురువు రాధాకృష్ణ

కామెంట్‌లు