*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం మ- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 కరిష్మా నజ్మా నర్మద చిన్మయ్
ఊర్మిళ ఇంటికి వచ్చారు
సుష్మ పద్మ నగ్మణి  ముగ్గురు
జీడిపప్పులతో ఉప్మా చేశారు
తిన్న తరువాత నిర్మలతో కలిసి
చార్మినార్ చూచుటకు వెళ్ళారు
నిర్మాణంలో గొప్ప తనం చూసి
ఎంతో విస్మయం చెందారు
కట్టడం వెనుకున్న కథనంలో
విషయాలెన్నో తెలుసుకున్నారు

కామెంట్‌లు