బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 11) సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం.నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు.
12) మనసును నిరోధించి ఏకాగ్రం చేయడమే విద్యాభ్యాసానికి పరమగమ్యం.కేవలం విషయసేకరణ మాత్రం కాదు.
13) ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది.
14) ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరుగవలసిన పనులు అవే జరిగిపోతుంటాయి.
15) అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి.పవిత్రులై, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులుగా కావాలి.అప్పుడే లోకంనుండి దుఃఖం నిష్క్రమిస్తుంది. అందుకు మరోమార్గం లేదు.
(సశేషము)

కామెంట్‌లు