మా ఇల్లు (ముత్యాల హారాలు):---గద్వాల సోమన్న

అందమైన మా ఇల్లు
ఆకసాన హరివిల్లు
ఆనందపు విరిజల్లు
ఆప్యాతల పొదరిల్లు

త్యాగానికది నిలయము
పవిత్రమైన ఆలయము
సమతమమతల గోపురము
ఆదర్శాల కాపురము

తల్లిదండ్రులు వేల్పులు
ఇంటిలో కల్పతరువులు
స్వఛ్చమైనవి ప్రేమలు
దీవెన వారి సేవలు

ఇల్లే మాకు స్వర్గము
చూపును మంచి మార్గము
మమకారాల దుర్గము
నిండు కుండలా క్షేమము

కామెంట్‌లు