రావయ్యా గానానాథా
కావవయ్య గానానాథా- మము
కావవయ్య గానానాథా !! గండాలు!!
సాంబశివుడి కొమరుడవయ్యా-నీవు
పార్వాతీ పుత్రుడవయ్యా
కైలాసం దిగిరావయ్యా
కైలాసం దిగిరావయ్యా !! గండాలు!!
ఏనూగూ మోమూతోడా
ఎలుకా వాహనామెక్కీ
వేగామె రావేమయ్యా
వేగామె రావేమయ్యా !! గండాలు!!
అల్లామూ ఆరాటీ పండ్లూ
బెల్లామూల మోరుండాలూ
తెచ్చీ నీకిచ్చెదమయ్యా
తెచ్చీ నీకిచ్చెదమయ్యా !!గండాలు!!
ఉండ్రాళ్ళూ కుడుములు నీకూ
పాశామూ ఫలహారాలూ
నైవేద్యం పెట్టెదమయ్యా
నైవేద్యం పెట్టెదమయ్యా !!గండాలు!!
ఎల్లా విద్దేలాకెల్లా సామీవీ నీవేనయ్యా
సకలా విద్దేలన్నీ నాకియ్యీ ఓగననాథా
నీపూజలు జేతూమయ్యా
నిను సక్కగ గొలుతూమయ్యా !!గండాలు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి