*ఉపాయం*(బాలసాహిత్యం)(చిట్టికథ):-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్

 అనగనగా ఓ కుందేలు పిల్ల.అది తోవ తప్పింది.వెళుతూ వెళుతూ సింహ గుహలోకి వెళ్ళిపోయింది.
 నిద్రపోతున్న సింహంపైకెక్కి జూలు పట్టుకొనిఆడుకోవడంప్రారంభించింది.సింహానికి మెళుకువ వచ్చింది.కోపంవచ్చింది కూడా.చిన్నపిల్ల దీనికేంతెలుస్తుంది పాపం.సింహానికి జాలేసింది.ఎలాగైనా వాళ్ళమ్మదగ్గరకు చేర్చాలనుకొంది. అంతలోనే అటుగా వచ్చిన నక్కను పిలిచి "ఓయ్ నక్కా! ఇలారా! ఈ కుందేలు పిల్ల తప్పిపోయి ఇలా వచ్చింది.దీన్ని వాళ్ళమ్మ దగ్గరకు చేర్చు" అంటూ ఆజ్ఞ జారీచేసింది.
అటుతర్వాత నక్కకు వేరే ఏపనీ లేకపోయినా ఇదొక పీడగా తలచింది. నేనేమిటి? ఈ చిన్నకుందేలును వాళ్ళమ్మ దగ్గరకు చేర్చడం ఏమిటి? అని మనసులో అనుకుంది.కాని రాజుముందు ఏమీ అనలేకపోయింది.సరే అని కుందేలును తన వీపుమీద ఎక్కించుకుని తీసుకుని అక్కడి నుండి బయటకు నడిచింది.
కొద్దిదూరంపోగానే కుందేలుపిల్లతో "నిన్ను చంపితిని నా ఆకలి తీర్చుకుంటాను"అంది.ఆమాటలకు భయపడిన కుందేలు అటూఇటూ చూసింది.పక్కనేఉన్న చెట్టుకొమ్మకు తేనెపట్టు కనిపించింది.వెంటనే కుందేలుపిల్ల నక్కవీపుపైనుండి ఎగిరి ఆ తేనెపట్టును కదిలించి తిరిగి కిందికిదూకి పరుగు తీసింది.అప్పుడే అటుగా వస్తున్న తన తల్లిని చేరుకుంది ఆనందంగా.ఇక మన కుందేలుపిల్ల చేసిన తేనెపట్టు కదలికకు దానిపైఉన్న తేనెటీగలు కోపంతో పైకిలేచి అక్కడ కనిపించిన నక్కను గాయాలయ్యేలా కుట్టి కుట్టి పెట్టాయి.అప్పుడు నక్క బాధతో ఏడుస్తూ అక్కడినుండి పరుగుతీసింది.
.
కామెంట్‌లు