వంట ఆట :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

అమ్మను చూసి నేర్చేరు 
బొమ్మలు తెచ్చి ఆడేరు 
వంటపాత్రలు పెట్టేరు 
అచ్చం అమ్మల యేరు 

అరుగు మీద కొందరు
చెట్టుకింద కొందరు
ఇంటిలోన కొందరు
మిత్రులతో నే ఆడేరు 

చూసిన వారే మెచ్చేరు
లోలోన నవ్వేరు
అమ్మాయిల ఆటలు
భావితరానికి పునాదులు
కామెంట్‌లు