*తీర్చును*(బాలగేయం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

దివినుండి కురిశాయిపూలు
అవేకదా చందాయి వెన్నెలపాలు
ఆకుపచ్చగా నవ్వెను చేలు
భువిలోని ప్రజలకదే మేలు
అమ్మకు మొక్కితే కష్టాలు కడతేరు
ఎప్పుడూ మరవొద్దు అమ్మపేరు
పేర్లు ఎన్ని ఉన్నా వేరువేరు
అది ఉన్నది ఒకటేగా నీరు
ఆ అమ్మే మన కష్టాలుబాపు
మన కంటికి రెప్పేగా కాపు
మన అందరిది ఎట్లున్నా రూపు
అమ్మ మనకు కరుణను చూపు
భక్తుల రక్షణ జరిగెను నాడు
అది ఎప్పటికీ వసివాడదు నేడు
ప్రజలందరు కోరుకునే కూడు
అమ్మయే తీర్చును మనగోడు!!
 
కామెంట్‌లు