విప్లవ కణిక
నవ తరానికి స్ఫూర్తి నింపిన యువకెరటం
స్వాతంత్ర పోరాట సంగ్రామంలో
పోరు సల్పిన విప్లవ యోధుడు
భరత జాతి బానిస విముక్తికోసం
కంకణం కట్టుకున్న పోరాట యోధుడు
జలియన్ వాల్ బాగ్
దురంతాలకు
జ్వలించిన హృదయం
మట్టి తల్లిని ముద్దాడిన దేశభక్తి
రక్తంతో తడిసిన మట్టిని
దేశ సంపదని తలచి
ఇంటికి కానుకగా తీసుకెళ్ళిన
చరిత్ర వీరుడు
బ్రిటిష్ సామ్రాజ్యం పాలకులకు
వ్యతిరేకంగా పోరాడి ఎగిసిన కెరటం
ఢిల్లీ వీధులలో ఎర్ర కాగితాలు
వెదజల్లిన ఎర్ర మందారం
ధీరత్వానికి నిలువెత్తు కొలమానం
ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకించి
అసెంబ్లీ పై దాడి చేసి
తెల్ల దొరల గుండెల్లో
సింహ స్వప్నమైన విప్లవం
శత్రువులు సైతం సెల్యూట్
చేసే ధీర చాతుర్యం
అసమానతలను వ్యతిరేకించి
జైలు జీవితం గడిపిన
భరతమాత ముద్దుబిడ్డ
స్వాతంత్ర పోరాట వీరుడు
మన భగత్ సింగ్
భారతావనికి తన ప్రాణాన్ని
బలి దానం చేసిన త్యాగధనుడు
నవతరానికి స్ఫూర్తి
దేశ భక్తి నిండిన ప్రతి హృదిలో విప్లవజ్యోతిగా
నేటి వెలుగు దారికి
నిదర్శనంగా నిలిచిన
విప్లవ వీరుడా... నీ జయంతి సందర్భంగా
విప్లవ ఉద్యమాలతో విప్లవ జోహార్లు నీకు..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి