లఘు కవిత - శాంతి :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 అందరికి అభిలాషలే దివ్యమైన  శాంతిగురించి.. 
హిరోషిమా నాటినుండీ అన్వేషణ వైఫల్యం 
కోరిన వ్యక్తి సృష్టిoచలేని శాంతి 
బైట నుండీ కోరే అర్హత ఎక్కడుందీ?? 
దొరికిన శాంతిని ముక్కలుగా 
నరికి పంచుకునే తత్వం.. 
పోనంత వరకూ శాంతి దొరకదు!!
కొన్ని దారుణాల నేపథ్యంలో.. 
నెలకొన్న ప్రశాంతత వెనుక, 
రక్త కన్నీరు,గుండెల్లో మెలిపెట్టే 
వ్యధ ఉండనే ఉంటుంది!!
శాంతి మంచులా సహజంగా 
కురిస్తేనే 
పారిజాతం పూలలా పరిమళo 
పంచితేనే... 
మనిషికి శాంతి !!

కామెంట్‌లు