వీడేనమ్మా వినాయకా!వీడే వీడే వినాయకా!
1వక్రతుండము చూడండీ ఏకదంతము చూడండీ
చేటంతచెవులు చూడండీ
గుజ్జు రూపము చూడండీ
శివపార్వతుల కొడుకంట
కుమారస్వామి కి అన్నంట
సిద్ధి బుద్ధికి పతియంట
లాభం జయముల తండ్రంట
3కుడుము ఉండ్రం చాలండి
గరికపూజలే చేయండి
లంబోదరుడు ఇతడండీ
పిల్లల దేవుని చూడండీ
4గుంజీలే తీస్తాము
గణనాధుని కొలిచేము
బుద్ధిగ చక్కగ చదివేము
చల్లగ చూడుమ గణపయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి