శ్రీ శ్రీ కవిత మాధుర్యం: :యడ్ల శ్రీనివాసరావు, :విజయనగరం జిల్లా

 నేను సైతం అని పలికిరి మహాప్రస్థానం రచించారు
జయభేరి మోగించింది మహాకవి గా నిలిచారు
గదిలో లేని దీపం ఆకాశ దీపం
గుడిలో మ్రోగనీ మోత గణ గణ గంటలు
పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని మేల్కొలిపి
బాటసారిగా మిగిలినవి రచనకు చావులేదు
వచనకు దిగులు లేదు ఒరవడికి బ్రతుకు గలదు
చీకటిలో వెలుగు అజ్ఞానం తొలగించు
ప్రమిదయు వెలుగు  శ్రీరంగం రచన
మందార హారాలు చాందస భావాలు
మూఢనమ్మకాలు అడ్డురావు తనకు
నవీన జగతికి వెలుగు విప్లవ వరవడి
శ్రామిక సంకెళ్లు తెంచు గగన విహారీ
నిండుకుండలా పాలవెల్లి లా
సిరిసిరిజల్లు లా తూలి పోనీ ఆశాకిరణం
మా శ్రీరంగం శ్రీనివాసరావు ప్రతిభ కి సాధ్యం

కామెంట్‌లు