శ్రీమతి ఆదూరి హైమవతి ...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ


 ఆమె దాదాపు అన్ని పేపర్లు  వారపత్రికల్లో రచనలు చేశారు. బహుమతులు పొందారు. బాధ్యతలు తీరాక పుట్టపర్తిలో ప్రశాంతంగా భగవధ్యానంతో పాటు సాహిత్య సేవకూడ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు  శ్రీమతి  ఆదూరి హైమవతి ..--ఆమె బాల్య స్మృతులు ఇవి.
=================================================================
ఆమెకు ఫోన్ చేస్తే చాలు "సాయిరాం!ఎవరు బంగారం!"అన్న ఆకమ్మని పిలుపు మనల్ని కట్టి పడేస్తుంది. ఆప్రేమ ఆప్యాయత కురిపించే  అమృత వాణి శ్రీమతి  ఆదూరి హైమవతి గారిది.జిల్లా  రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం అందుకున్నారు. 26.9.21న అమెరికా కెనడా తెలుగు వారి సాహితీ సదస్సు లో  ఆన్లైన్ లో పాల్గొన్నారు. 40ఏళ్ల టీచర్ జాబ్ లో 33ఏళ్లు హెచ్. ఎం.గా పనిచేశారు. పిల్లలకోసం  కథలు నాటకాలు చాలా రాశారు. విజయవాడ  రేడియో లో ప్రసారం అయినాయి. ఇప్పటికీ ప్రింటెడ్ వెబ్ మాగజైన్లలో రాస్తున్నారు. 108నీతి కధల పుస్తకం సత్యసాయి బాలవికాస్  గురువులకు రిసోర్స్ పర్సన్ గా శిక్షణ ఇస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపతి జాతీయ అవార్డు అందుకున్నారు.తన బాల్య స్మృతులను బెంగళూరు నించి  నాకు పంపారు. "మాఅమ్మ  నాన్నలు చాకలకొండ చెంచురామయ్య సుశీలమ్మ. వారు కూడా టీచర్లు. నాకు 13 ఏళ్ల వయసులో  మానాన్న మురికివాడ బాలలకోసం పడే తాపత్రయం నన్ను  టీచర్ గా మార్చింది. నాన్న  తెల్లవార్లు కూచుని మూడు రకాల పిల్లల కోసం పేపర్లలో బిట్  ప్రశ్నలు తయారు చేసే వారు. బాగా తెలివిగలవారు మధ్యస్థాయి  ఆపై బాగా చదువులో వెనుకబడిన వారి కోసం  తేలిక ప్రశ్నాపత్రం తయారు చేసే వారు. అందరూ పాస్ అవ్వాలి అని ఆయన ఆశయం.నేను ఎం.ఎ.బిఇడి చేశాను. నేను కూడా స్లమ్ ఏరియా పిల్లలబడిలో చేశాను. ఆపిల్లలంతా నేడు ఉన్నత చదువులు చదివి  మంచి హోదాల్లో ఉన్నారు. నాభర్త కూడా  కావలి జవహర్ భారతి కాలేజ్ లో లెక్చరరుగా చేసి రిటైరయ్యారు. పిల్లలు స్థిరపడ్డారు. కొన్నాళ్లు కూతురు దగ్గర బెంగళూరు లో ఉంటాను.మిగతారోజులలో పుట్టపర్తి ఆశ్రమంలో ఉంటాను.
కామెంట్‌లు