నాయకా, వినాయకా!!:-- యామిజాల జగదీశ్

 ముప్పై మూడు కోట్ల
దేవతలందరికీ 
ఆద్యుడు
పరమేశ్వరుడి 
పుత్రుడు
గజముఖ నాయకుడా
తమ్ముడు కుమారస్వామికి
తోడున్న విఘ్నేశ్వరుడా
సమయస్ఫూర్తితో 
అమ్మానాన్నలనే 
ప్రదక్షిణ చేసి
జ్ఞానఫలాన్ని దక్కించుకున్న 
వినాయకుడా
సంగీత నాదావివి
నీ తొండమే
మా జీవిత నమ్మకం
నాయకా 
వినాయకా
తొలి పూజలందుకునే
నాయకుడివి
తలచినవన్నీ
నిరాటంకంగా 
సాగడానికి
నీ చల్లనిచూపులు
మాకందరికీ
ఎల్లప్పుడూ అవసరం
బుద్ధిని ప్రసాదించు
సిద్ధిస్తుంది నీ కృపతో
అర్థం
పరమార్థం
పరిపూర్ణ జ్ఞానం
కల్గించే గణపతీ
నీ వక్రతుండమే
ప్రణవమూ
ఓంకారమూ
ఏకదంతుడా
అడ్డంకులు తొలగించు
విద్యనే వెలుగును ప్రసరించు
వరసిద్ధి వినాయకా
నీ అనుగ్రహమే 
అందరికీ అండా! దండా!!

కామెంట్‌లు