*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం ప-ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 కల్పన పూజలు  చేస్తుంది
దిక్పాలకులైన దేవతలందరినీ
మొక్కులెన్నో మొక్కుతుంది
మాన్పుమయ్యా మా బాధలంటూ
పూలు ఫలాలను సమర్పించి
కర్పూర హారతులు ఇస్తుంది
కంటికి కన్పడే పేద సాదలకూ
దానాలను ఎన్నో చేస్తుంది
సేవకు మనసును అర్పించి
ఆనందంగా జీవితం నడిపిస్తుంది

కామెంట్‌లు