క్రొత్త కాలువ - బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

వానా వానా వల్లప్పా 
కొత్త కాలువ ఉందప్పా 
చిన్ని చిన్ని చేపలతోటి 
పారే నీళ్ళు వింతప్పా !

వాకిలి ముందే కాలువలోయ్ 
కాగితంపడవలు చెయ్యాలోయ్ 
కత్తి పడవలు నాకిష్టం 
గట్టిగ నిల్చి మునగదురోయ్!

జలజలపారే కొత్త నీరు 
వాగులు వంకలు మహజోరు 
అన్నీ కలిసే మా చెరువుకి 
తూముల వంతెన కట్టేరు!

చక చక సాగే  గంగమ్మా 
పాడీ పంటా నీ దయగా 
వరదలు ముంపు మాకొద్దు 
చేలకు బంగరు పంటమ్మా !

కామెంట్‌లు