*చదువుల గుడి*:-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
కొత్త పలకను తెచ్చింది
కొత్త బ్యాగులో పెట్టింది
బలపం దానిలొ వేసింది
చదువుల గుడికి పంపింది

నాలాంటి వారే వున్నారు
నవ్వుతూ దగ్గరకొచ్చారు
చాక్లెట్లు కుర్ కురే లిచ్చారు
ముచ్చట్లెన్నొ చెప్పారు

గురువు గారు వచ్తారు
నవ్వుతు ఎన్నొ చెప్పారు
అక్షరాలు పెట్టిచ్చారు
పలుకుతు దిద్దు మన్నారు

కామెంట్‌లు