*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం న-ఒత్తు*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 విఘ్నేశుని పండుగ వచ్చింది
స్నేహితులు అందరూ కలిశారు
బంకమట్టిని చాలా తెచ్చారు
విఘ్నేశుని చేయ యత్నించారు
రత్నమాల, జాహ్నవి చక్కగ చేశారు
చిన్ని పందిరి అరుగు వేశారు
లగ్నం ముహూర్తం చూశారు
గణేశుని పూలతో అలంకరించి
మంచిగ చదువు రావాలంటూ
భక్తితో వినాయకుని కొలిచారు

కామెంట్‌లు