*భక్తి*(బాలగేయం):-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.

 రామా కృష్ణా అంటూ భక్తితొ
ఇష్టదైవమును *తలవండి*
రామా కృష్ణా అంటూ ప్రేమతొ
పుత్రరత్నముల *పిలవండి*
ఇష్టదైవము ఏదైనాను 
రోజూ శ్రధ్ధగ *కొలవండి*
మంచినడతగల వ్యక్తులను
ప్రతిరోజూ మీరు *కలవండి*
దైవనామము ఎల్లప్పుడు
మీ మదిలో భక్తిగ *పలకండి*
మంచివ్యక్తిగా మారడానికి
దైవనామమే *పిలకండి*
పిలక కాస్త పెద్దగమారి
సద్వర్తనకు *మొలకండి*
మంచినడవడికతొ దయ జాలి ప్రేమను
ప్రతివ్యక్తిపై మీరు *చిలకండి*!!

కామెంట్‌లు