డిస్.లెక్సియా(dyslexia) అనే పదాన్ని మొదటి పర్యాయం మా 13 సంవత్సరాల మనుమరాలిద్వారా విన్నాను. డిస్.లెక్సియా అంటే చిన్న పిల్లల్లో తోటి పిల్లమాదిరి కాకుండా ఏదైనా తెలుసుకోడం, రాయడం, బోధపరుచుకోడంలో వెనకబడి ఉండడం అట! అక్షరాలను సరిగ్గా గుర్తించలేక పోవడం, బోర్డు మీద టీచర్లు రాసింది త్వరగా రాసుకోలేకపోవడం వంటి ఇబ్బందులకు గురవుతారట. తల్లి దండ్రులు, అధ్యాపకులూ ఈ లక్షణాలను సరైన సమయంలో గుర్తించలేకపోతే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, మొద్దని ముద్రవేయడం చేస్తారు. విద్యాబోధనలో శిక్షణ పూర్తి చేసినవారు కూడా ఈ లక్షణాలను గుర్తించకపోతే, పిల్లలు ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతారు.
ఈ సమస్యమీద మిత్రులు శ్రీరామకృష్ణ "మానసడైరి" పేరుతో చిన్న బాలల నవల రాశారు. బాలల నవల అని అనడం ఎందుకంటే మా మనమరాలు ఈ నవలను పదిసార్లు చదివిందట! పెద్దలు ఎందుకు చదవాలంటే డిస్.లెక్సియాతో ఇబ్బందులు పడే పిల్లల సమస్యను అవగాహన కలిగించుకోడం కోసం. పిల్లల సుకుమారమైన మనస్సులో భావాలను రామకృష్ణ చక్కగా చిత్రించారు. దీనివెనక పిల్లల చదువుల విషయంలో వారి అపారమైన అనుభవం, కృషి ఉంది. తానావారు దీన్ని ప్రచురించారు. అందరూ చదవదగిన పుస్తకం. తానాప్రచురణ. మంచిపుస్తకం. సికింద్రాబాద్. ఫోన్.94907 46614.
మానస డైరీ : -కళిదాసు పురుషోత్తం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి