గాంధీతత్వం : భరద్వాజ రావినూతల

 256)
ఆయనొక అహింసా ఆధ్యాత్మికుడు 
ఆయన ఒక  శాంతికాముకుడు 
నిరాడంబరం  ఆయన  మతం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
257)
దక్షిణాఫ్రికాన జరిగిన సంఘటన 
స్వాతంత్ర్యోద్యమనికి నాందీప్రస్తావన 
అహింసా ఆయుధం పట్టాడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
258)
క్రమశిక్షణగా పెరిగిన జీవితం 
తల్లిమాట ఆయనకు శాసనం 
అలవర్చుకున్నాడు సమతావాదం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
259)
కొళాయికట్టిన ఓమామూలు వ్యక్తి 
స్వాతంత్రపోరాటానికి అయినాడు శక్తీ 
జాతిపితై వెలుగొందిన మహాత్ముడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
260)
కట్టిన కొల్లాయి జనాలకాదర్శం 
చేతికర్రె  ఆయన ఆయుధం 
సత్యంతో బ్రతికింది జీవితం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
కామెంట్‌లు