బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 16) దిగంతాలకు తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచిఉండేవారే అద్భుతాలను సుసాధ్యం చేయగలరు.
17) కార్యాచరణ మంచిదే.కానీ దానికి మూలం ఆలోచన.కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి.రేయింబవళ్ళు వాటినే స్మరించండి.అప్పుడే అద్భుతాలు సాధించగలరు.
18) కష్టాలు అనే అభేద్యమైన అడ్డుగోడలను చీల్చుకుని ముందుకు సాగేది,సఛ్ఛీలంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే కాని ధనం, పేరు, ప్రతిష్టలు, ఆకర్షణలు ఇవేవీ కావు.
19) "నేను సముద్రాన్నే ఔపోసన పడతాను.నేను సంకల్పిస్తే కొండలే పిండి అవుతాయి" అని కార్యశూరులు అంటారు.అలాంటి శక్తి,సంకల్పాలతో అవిశ్రాంతంగా శ్రమించినప్పుడే గమ్యాన్ని చేరగలం.
20) ఏకాగ్రత పెంపొందించే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు.ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైకమార్గం.

కామెంట్‌లు