వరల్డ్స్ హార్ట్. డే:- ప్రతాప్ కౌటిళ్యా( కె ప్రతాప్ రెడ్డి)

హృదయాన్ని
 చూడాలనుకుంటే
 సూర్యోదయాన్ని చూడండి!?

  హృదయం
 దయను
 చూడాలనుకుంటే
 చంద్రోదయాన్ని చూడండి!?

 హృదయాన్ని
 గాయం చేసి
 అడ్డంగా కోసిన
 ఒక బృందావనమైకనిపిస్తుంది!?

 కుడి ఎడమలు
 రెండైనా
 ఏ తోడు లేకున్నా
 ఎడమకి వెలిసిన
 దేవాలయం హృదయం!?

  హృదయం
 వరాలు రెండు
  ఎరుపు నీలం
 సిరలు ధమనులు
 అది
 ఒక అద్భుత పరిశుద్ధ
 బంగారు కర్మాగారం!?

 హృదయంలో
 మంచి చెడుల
 నాలుగు గదులు
 అందులో
 దయ్యం కాదు
 దేవుడు ఉండాలి
 మానవుడు ఉండాలి!?
 నీచత్వం కాదు 
 మానవత్వం ఉండాలి!?
కోపం
         pratapkoutilya lecturer in Bio-Chem palem 8309529273
కామెంట్‌లు