*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౮ - 018)
 కందం:
*స్వాంతప్రవృత్తిఁ గార్యా*
*నంతరమున మిత్ర లక్షణంబును నుద్యో*
*గాంతమున బంధుత్వముఁను*
*గొంతైనంతటను చూడు గువ్వలచెన్నా!*
తా.: 
  ఈ భూమి మీద ఎవరికి వారికి అనుకూలంగా వుండే ఫలితము కోసం స్నేహం చేసినప్పుడు, ఆ పని పూర్తి అయ్యాక ఎలా ప్రవర్తిస్తారు అనే విషయం మీద స్నేహం ఆధారపడి వుంటుంది.   అలాగే మనం వుద్యోగం లో వున్నప్పుడు మన చుట్టూ తిరిగే చుట్టాలు, స్నేహితులు , మనం ఆ ఉద్యోగం నుండి విరమణ చేసిన తరువాత, మనల్ని గురించి ఆలోచించరు, మనతో వుండడానికి కూడా రారు, ఇష్టపడరు....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఈ చరాచర జగత్తు లో, మనం చేసే స్నేహాలన్నీ ఫలితాలపైనే ఆధారపడి వుంటాయి. స్నేహం అనగానే, కర్ణ దుర్యోధనుల స్నేహం జ్ఞప్తికి వస్తుంది. కానీ ఈ స్నేహం వల్ల సమాజానికి ఏమీ లాభం లేదు సరికదా 18 అక్షౌహిణుల సైన్యం ప్రాణాలు కోల్పోయారు. ఇది అధమ స్నేహం.  ఇక రామ సుగ్రీవుల స్నేహం.  ఇందులో సుగ్రీవుని కి రాముడికి కూడా లాభం కలిగింది. ఇది మధ్యమ స్నేహం.  నరనారాయణులైన, కృష్ణార్జునుల స్నేహం, మూడవది.  ఈ స్నేహం లో అర్జునుడు లాభం పొందాడో లేదో కానీ, సమాజానికి "భగవద్గీత" లభించింది.  నారాయణుని విశ్వరూప దర్శనం అయ్యింది.  మానవాళి ని ఉద్దరించే "విష్ణు సహస్రనామాలు" దొరికాయి.  ఇది ఉత్తమ స్నేహం.  కనుక, మనుషులు, చేయవలసినది స్వార్ధ రహిత స్నేహం. నలుగురి మంచికి పనికివచ్చే స్నేహం, చుట్టరికం. నేను, నా ఇల్లు కాకుండా, మనము, మన సమాజం, మన దేశం అని ఆలోచించ గలిగిన పరిస్థితి కి చేరి, మనమందరం గా వుండగలగాలి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు