"ముత్యాల హారాలు"-- విస్లావత్ సావిత్రి,--10వ తరగతి, జడ్.పి.హెచ్.ఎస్ నేరళ్ల పల్లి మహబూబ్ నగర్7013264644

 71.
 అందమైన పుస్తకాలు,
 ఆదరించే   గేయాలు,
 ముత్యాల్లాంటి హారాలు,
 కవయిత్రి కోసం కలలు.
72.
 అందమైన జీవితము!
 ఆడపిల్ల జీవితము!
 అందమైన ప్రతిరూపము!
 అమ్మ నాన్న రూపము!
73.
 చిన్న వయస్సు పెళ్లి రా.
 పెళ్లి చేస్తే శిక్ష రా.
 మంచి స్థాయికి ఎదుగురా.
 జ్ఞానాన్ని అందుకోరా.
74.
 చిన్న వయసు పెళ్లొద్దు!
 చదువే మనకు ముద్దు!
రోగాల బారి పడొద్దు!
బంగారు భవిత కద్దు!
75.
 అందమైన బోధనము.
 గురువుల బోధనము.
 ఇష్టంగా చదువుము.
 ముందున్నది భవితవ్యము.
76.
 నాన్నను ప్రేమించురన్న!
 నీ కీర్తిని కోరురన్న!
అమ్మను ప్రేమించన్న!
పెద్ద స్థాయికి ఎదగన్న!
77.
 బాలికలను చదివిద్దాం!
వారిని ఎదగనిద్దాం!
గమ్యం వైపు చేరుద్దాం.
దేశాన్ని వెలిగిద్దాం.
78.
 స్త్రీకి రక్షణ ఇచ్చినను,
 అన్యాయాలు పొగొట్టును!
 మంచి పనులు నేర్చుకొను!
 సమాజంమంత మారును!
79.
 పరిశుభ్రంగా ఉండుము.
 రోగాలను పోగొట్టుము.
 పోషకాహారం తినుము.
 ఆరోగ్యంగా ఉండుము.
80.
 ధనం చూసి కాదురా!
 గుణం చూసి చెయ్యిరా!
 మంచి నెయ్యం చేయరా!
 చైతన్యమై మెలగరా!
81.
గడియారాన్ని చూసుకో!
టైమ్ కేటాయించుకో!
సమయం విలువ తెలుసుకో!
పని పూర్తిగా చేసుకో!
82.
 అమ్మ ప్రేమ అమృతము!
 నాన్న మనసు త్యాగము!
 సృష్టిలో అద్భుతము!
 భగవంతుడి రూపము!
83.
 రంగుల పూలు  తీసుకొని.
 బతుకమ్మను  చేసితిని.
 గౌరమ్మను పెట్టితిని.
 సతులతో ఆడి, పాడితిని.
84.
 పల్లెను వదలుకోకు !
 ప్రేమభిమానం  మరవకు!
 అనుబంధం తగ్గించకు!
 అదే అసలని మరువకు!
85.
 ఉదయాన్నే లేవుము.
 దినపత్రికను  చదువుము.
 విషయాలు తెలుసుకొనుము.
 జీవితం సాగించుము.
86.
 సేంద్రియ ఎరువు వాడయ్య!
 పంటలు పండించయ్య!
 కష్టపడి పని చేసయ్య!
 అందరి కడుపు నింపయ్య!
87.
 అన్నదానం చేయును.
 పేదల కడుపు నింపును.
 ముందు అడుగు వేయును.
 ఆశీస్సులు తీసుకొను.
88.
చినిగిన అంగి వేసుకో!
మంచి పుస్తకం కొనుకో!
అమ్మనాన్నను నమ్ముకో!
నీ గమ్యాన్ని చేరుకో!
89.
 టీవీలు చూడకురా!
 ఫోన్లను వాడకురా!
 పుస్తకాలు చదువురా!
 జ్ఞానo నమ్ముకోరా!
90.
ఒక్కడివని భయపడకు ,
లేరని కుళ్ళి పోకు,
మౌనంగా ఉండి పోకు,
చెడు దారిలోకి నడవకు.
91.
 ఆలోచన చేయుము!
గురు మార్గం పోవుము!
తల్లి కోరిక తీర్చుము!
తండ్రి నమ్మకం ఉంచుము!
92.
పుస్తకాలు అమ్మకురా!
జ్ఞానాన్ని మరవకురా!
పుస్తకం కొనుకోరా!
తెలివిని తెచ్చుకోరా!
93.
 ఆస్తిచూసి మురిసిపోకు!
 మాటలొస్తయని ఎగరకు!
 రాజునని అనుకోకు!
 పేద వారిని ముంచకు!
94.
 దీపావళి పండగా!
 ప్రతి ఇల్లు నిండుగా!
 దీపాలు వెలగగా!
 ఇల్లంత సందడిగా!
95.
 కరోన టీక వేసుకో,
 ప్రాణాన్ని రక్షించుకో,
 కోవిడ్ తరిమగొట్టుకో,
 సుఖంగా జీవించుకో.
96.
మనిషికి బుద్ధి అందం!
చెట్టుకు ఆకులు అందం!
కోకిలకు పాట అందం!
నెమలికి  నాట్యం అందం!
97.
 మాస్క్ ను ధరించారా!
 దూరం పాటించరా!
 శానిటైజర్ రాయరా!
 చేతులను శుభ్రపరచరా!
98.
 డబ్బులకు ఆశ పడకు!
 తల్లిదండ్రిని ముంచకు!
 గౌరవం పోగొట్టకు!
 చెడ్డ పేరు తెచ్చుకోకు!
99.
అంబేద్కర్ మాటలు.
ఆదరించే రూపాలు.
జీవితం మార్చే కలలు.
ఆదర్శం ఉండె అలలు.
100.
 చెత్తను పడేయకండి.
 బుట్టలో వేయండి.
 శుభ్రంగా ఉండండి.
 దేశం బాగు పరచండి.
101.
 స్త్రీలను చంపకయ్య!
 పాపాలను పొందకయ్య!
 శిక్ష అనుభవించకయ్య!
 ప్రాణాన్ని కోల్పోకయ్య!
102.
 పుస్తకాలు చదువు వొయ్.
 జ్ఞానాన్నే పెంచోయ్.
 చరిత్రలను చదువవోయ్.
 నీ గమ్యాన్ని చేరుకోయ్.
103.
 ఉగాది పండగగా!
 ఊరంతా నిండగా!
 పచ్చళ్ళు చేయగా!
 ఆనందంగ ఉండగా!
104.
గౌరమ్మ పండగా .
స్త్రీల మనసు నిండగా.
తొమ్మిది రోజులు పండగా.
బతుకమ్మ పండగా.
105.
 సావిత్రిబాయి గీతాలు!
 పరవశిoచు పిల్లలు!
 ఆదరించే పాటలు!
 మనసుకు ఎంతో హాయిలు!
106.
 పూర్వీకుల త్యాగాలు.
 మరువలేని హోదాలు.
 చెప్పుకోలేని కలలు.
 మరవలేని త్యాగాలు.
107.
 సోమరితనం వద్దు!
 కష్టమే మనకు ముద్దు!
 పిసినారితనం వద్దు!
 దానమే మనకు హద్దు!
108.
 దేశానికి ఐలమ్మ.
 రోకలెత్తిన నేలమ్మ .
 తొడగొట్టే దొరమ్మ.
 సాహస చాకలైలమ్మ.

కామెంట్‌లు