"వాల్మీకిముని జయంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
కం.
రత్నాకరుడేబోయగ
రత్నమ్ముగరచనజేసెరామునిగాథన్
రత్నమ్ముకెరత్నమ్ముగ
రత్నమ్ముగసొబగులీనురామాయణమున్!!!

02.
కం.
శరణాగతరక్షణకై
ధరపైధర్మమ్మునిల్పతగువిధములుగన్
కరుణాసాగరుడగురఘు
వరుచరితనువ్రాసినాడువాల్మీకికవీ!!!

03.
కం.
రామునిగూర్చియుకూర్చిన
ఓమునివాల్మీకినీవునున్నతుడవు నీ
నామమ్మునుదల్చుకొనుచు
రామాయణకావ్యమందురసమునుగ్రోల్తున్!!!

04.
కం.
శోకమ్మొకశ్లోకముగా
శ్రీకరముగయొప్పినట్టిచిరకావ్యముగా
లోకానికంతటికి వా
ల్మీకియెరామాయణమ్ములీలగనొసగెన్!!!




కామెంట్‌లు