"ఐక్యరాజ్యసమితి"ఆవిర్భావదినోత్సవము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467

 01.
తే.గీ.
శాంతియుతమైనచర్చలుజరిపివివిధ
దేశములమధ్య మైత్రినితీరుగాను
పంచిఐక్యరాజ్యసమితిపాటుపడుచు
పెద్ధసంస్థగాభువిపైన పేరునొందె!!! 

02.
తే.గీ.
యుద్ధములనాపిశాంతినిముద్దులొలుకు
నట్లుజేయుచుముందుకునడుపుచుండి
వివిధదేశాలమధ్యనవిభజనలను
తొలగజేయుచురక్షణకలుగజేయు!!!

03.
తే.గీ.
దేశములతగాదాలనుధ్యేయముగను
శాంతిఒప్పందములతోడసాధ్యపరిచి
సాంఘికాభివృద్ధినిపొందిసంస్కరణలను
ఎన్నొచేపట్టినడిపించిమన్ననొందు!!!

04.
కం.
ఐ.రా.సా.ఐ.రా.సా.
దారినిజూపించిదేశదశలనుమార్చున్
పోరాటమ్ములనాపియు
నేరుగకాంక్షించుశాంతినిత్యమ్మిదియున్!!!కామెంట్‌లు