01.
తే.గీ.
ధనముశాశ్వతంబనిజనుల్ధరణియందు
విఱ్ఱవీగుచునున్నారువెఱ్ఱిగాదె
గుణముశాశ్వతంబనివారుకొంచమైన
తెలుసుకోలేకపోతుండెతెలివిమీర!!!
02.
తే.గీ.
గర్వరహితులైసతతంబుసర్వజనుల
నీసడించియుహింసించియెన్నొతీర్లు
బాధపెట్టుటసరికాదు,బోధజేసి
వివరముగదెల్పెకవులంతవివిధముగను!!!
03.
తే.గీ.
పలుకుపలుకులోసుధలొల్కుపలుకుపలికి
పదముపదములోరసభావపదముచిలికి
శబ్దశబ్దమ్ములోగంధసౌరులద్ది
మాటలాడినమేల్గూరుమనుజలకును!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి