366.
దైవాన్ని పూజిస్తాము
పూలతో మనందరము
ఆపూలే దైవము
బతుకమ్మ సంబరము.
367.
తెచ్చి తీరొక్కపూలు
పేర్చాము బతుకమ్మలు
బొడ్డెమ్మ,కోలాటములు
ఆడిరమ్మా! సతులు.
368.
సాంప్రదాయ సంస్కృతి
తెలంగాణ పరపతి
ఉప్పొంగేను ప్రకృతి.
జై జై తెలుగు భారతి.
369.
వనజాతర వచ్చింది.
అడవితల్లి మెచ్చింది.
గునుగు పూలనిచ్చింది.
తంగేడు అలరించింది.
370.
ఎంగిలి పూల బతుకమ్మ
అమావాస్యనాడమ్మ
అమ్మలక్కలు ఓయమ్మ
బతుకమ్మ ఆడండమ్మ.
371.
ఊరు,వాడ ఉత్సవము
అలరారే సోయగము
పూలన్నీ తెచ్చేము
చిత్రంగా పేర్చేము.
372.
తెలంగాణ ఆడపడుచు
మా ఇంటి ఇలవేల్పగుచు
వెలుగులు విరజిమ్ముచు
జనులు శ్రమనే మైమరచు.
373.
పూల రంగుల వలెను
ఊహలుప్పొంగేను.
తెలంగాణ జనులెల్లను
కష్టాలు మైమరచేను.
374.
నింగిలో సింగిడి చూడు
నేల దిగి వచ్చెను నేడు.
ధరణి యంత రంగులుండు
కళ్ళలో కాంతి నిండు.
375.
పూలలోని రెక్కలు
మనసులోని ఆశలు
ముద్దబంతి పూవులు
ముగ్దమనోహరాలు.
376.
ప్రతియేటా రావమ్మ
వీడ్కోలు నీకమ్మ
దీవించు మాయమ్మ
బంగారు బతుకమ్మ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి