శాంతి బహుమతి:---నెల్లుట్ల సునీత--కలం పేరు శ్రీరామఖమ్మం7989460657

రవి అస్తమించని
 బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
గడగడలాడించిన భారత తేజం
సత్యం అహింస 
ఆయుధాలుగా
మలచి

భరతమాత సంకెళ్లను తెంపి
భారతావనికి
 స్వేచ్ఛావాయువుల
 ఊపిరిలూదిన మహాత్ముడు

ప్రకృతిలో దైవాన్ని
 దర్శించిన
ప్రకృతి ఆరాధ్యుడు
ఆధ్యాత్మిక తత్వశాస్త్ర
 సిద్ధాంతాలను పుణికిపుచ్చుకుని
శాంతియుత నిరసనలకు 
కంకణం కట్టుకుని

మహిళా సాధికారతకు 
బాసటగా నిలిచి 
హక్కులకోసం బాటలు వేసిన
 జాతిపిత
స్వాతంత్ర సంగ్రామంలో
 నిరాకరణ సత్యాగ్రహ
 ఉద్యమం నడిపిన మహాత్ముడు

అట్టడుగు వర్గాలకు
 అండగా నిలిచి
సమస్త మానవాళిని
 మేల్కొల్పిన విశ్వనేత
జాతి వివక్షత కోసం 
పోరాడిన యోధుడు

అక్టోబర్ 2ను అంతర్జాతీయ 
అహింసా దినోత్సవంగా
 యావత్ ప్రపంచ సంబరాలు

గాంధీ తత్వ స్ఫూర్తితో
 నోట్లపై జారీచేసిన
 భారత ప్రభుత్వం
శాంతి బహుమతి పేరిట
గాంధీ జన్మదిన కానుకగా..!


కామెంట్‌లు