దుష్ట శక్తుల సంహారిణి;- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,చిట్యాల,నల్గొండ,8555010108
అస్త్ర శస్త్ర భూషణా లంకృత శోభిత శ్రీదేవీ                                                             
మందహాసిని మధురభాసిని ముకుంద రమణీ
నీ నామం జపించిన దుష్టశక్తుల భయం తొలగు
సమస్త దైవ శక్తులు మూర్తీభవించిన తేజోరూపం!

అఖిలాండ కోటి ఆరాధ్య దైవం ఆది పరాశక్తి 
ఇంద్రకీలాద్రి వాసిని విమల మనోహరి వాగ్దేవి
అఖండ విజయ బలపరాక్రమ శక్తి స్వరూపిణి
పులి వాహన మెక్కి పుడమి నేలే పురంధరేశ్వరి!

మహిషాసుర మర్ధిని మహాశక్తి జగజ్జననీ
దుష్ట శక్తుల సంహారిణి విజయ దుర్గా భవాని
ఆకలి కడుపులు నింపే అన్నపూర్ణేశ్వరీ మహాకాళీ
కార్యసిద్ధికై అవతరించిన మోక్ష దాయిని జగన్మాత!

అలవోక


గ కనికరించే అశేష జన మోహినీ
దుర్గాదేవి ఆరాధన శతకోటి పుణ్య ఫలం                  
శత్రు పీడనం తొలగిపోయి చేకూరు విజయం
ఆపద మొక్కులు తీర్చే అంబిక అమ్మోరు తల్లీ!

మహా ప్రకృతి స్వరూపిణి శంకరి అభయంకరి
కోటి సూర్య ప్రభలతో వెలిగే మహా గౌరీ కరుణాకరి
దుర్గముడనే అసురుడిని సంహరించిన చాముండి
సర్వ దుర్గతుల నివారించే కనక దుర్గా నమోస్తుతే!                                                                

కామెంట్‌లు