గీతామృతం ఆస్వాదించి బోధించిన జీవిత సత్యం
ఉన్నత చదువున్నా ఉద్యమమే ఊపిరిగా
దేహం అణువణువు దేశసేవకు సమర్పణం!
ఓ చేతిలో ఊతకర్ర తెల్ల తుపాకిని తరిమేసి
విజయానికి ప్రతీకగా నిలిచే ఆత్మ స్థైర్యం
మరో చేతిలో డైరీ నను మరువొద్దంటూ
కాలం జీవితం విలువల ఇంగితం తెలిపే జ్ఞాపకం!
సత్యం అహింసలే ఉచ్ఛ్వాస నిష్చ్వాసలుగా
సహాయ నిరాకరణ సత్యాగ్రహం సారధిగా
క్విట్ ఇండియా ఉద్యమ వారథిగా
ఆంగ్ల అరాచక పాలనకు చరమ గీతం పాడగ
నిజాయితీ నిగ్రహాం నిరాడంబర జీవనం
కరుణ క్రమశిక్షణ కలిగిన ఆదర్శ జాతిపిత
కుష్టు రోగుల కష్టాల సాంత్వన పర్చిన మహాత్మా!
సకల కుల మతాలొక్కటని చాటిన సత్యాన్వేషి
బానిస బతుకు బంధనం చేధించిన ఉద్యమనేత
నర నరాన నవ చేతన రగిలించిన జాతీయవాది
విశ్వలోకానికి శాంతి మార్గం చూపిన మార్గదర్శి
తరం తరం నిరంతరం స్మరణీయం ఓ బాపూజీ!
(అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి