నీ నవ్వు ;-డా|| బాలాజీదీక్షితులు పి.వితిరుపతి8885391722
 అలా నవ్వుతావేం
పారిజతం పక్కుమన్నట్టు
జాజితీగ పాకినట్టు
మరుమల్లె విచ్చినట్టు
చల్ల గాలి వీచినట్టు
మంచు చుక్క మెరిసినట్టు
పాలతరగ పొంగినట్టు
నీటి బుడగతేలినట్టు
పూల వాన కురిసినట్టు
నింగి కొంచం అందినట్టు
పొలం లో కంకులేసినట్టు
పంట చేలు ఊగినట్టు
నిజంగా నీ మీదొట్టు
నీ నవ్వే వేయి అందల పెట్టు


కామెంట్‌లు